ETV Bharat / city

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు - minister ktr casted his graduate vote in Hyderabad

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్​లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్, మహబూబ్​నగర్​లో పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

telengana mlc elections
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు
author img

By

Published : Mar 14, 2021, 11:30 AM IST

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు.

హైదరాబాద్​లోని షేక్​పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తన ఓటు వేశానని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యావంతులంతా సమర్థులకే ఓటు వేయాలని కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు

మహబూబ్​నగర్​లో రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్​లో పాల్గొనాలని కోరారు. విద్యావంతులు ఓటింగ్​కు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

telengana mlc elections
ఓటు హక్కు వినియోగించుకున్న హోంమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్ మలక్​పేటలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో బాలుర జూనియర్ కళాశాలలో ని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉండే పట్టభద్రుడు సైతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని మంత్రి తెలిపారు.

telengana mlc elections
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి
  • ఇదీ చూడండి :

కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు .. వెలువడుతున్న ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.