రాష్ట్రంలో వేలాదిగా కరోనా కేసులొస్తుంటే ఎన్నికలు నిర్వహిస్తారా? అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... తెదేపాపై మండిపడ్డారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుంటే ఎన్నికలు పెట్టాలని అచ్చెన్నాయుడు ఎలా అడుగుతారని మంత్రి అన్నారు. కావాలంటే తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా పోటీ చేసుకోవచ్చని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన పంట నష్టాన్ని అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేసి నవంబర్‌లో రైతులకు పరిహారం అందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు భరోసా పథకంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సాయంతోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపిన కన్నబాబు... ఆ పథకం పూర్తి పేరు రైతుభరోసా- పీఎం కిసాన్ యోజన అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి