Buggana Clarity on CM London tour: ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తెదేపాకి ఒక అలవాటుగా మారిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన మీద యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి పర్యటన రహస్యమేమీ కాదని కుటుంబ సభ్యులతో కలిసి దావోస్ చేరుకుంటారన్న విషయంలో ఎలాంటి రహస్యం లేదని బుగ్గన తేల్చిచెప్పారు. సీఎం విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందన్న బుగ్గన.....ఎయిర్‌ట్రాఫిక్ రద్దీతో అక్కడ ఆలస్యం జరిగిందని తెలిపారు. లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యిందన్నారు. లండన్‌లోనూ ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉందన్నారు బుగ్గన. ఈలోగా జురెక్‌లో ల్యాండ్ అవడానికి ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందన్నారు. ఆ సమయంలో జురెక్‌లో విమానాలు ల్యాండింగ్ అనుమతి లేదన్నారు. విషయాలన్నీ భారత ఎంబసీ అధికారులు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి, చివరకు లండన్‌లోనే ముఖ్యమంత్రికి బస ఏర్పాటు చేశారన్నారు. తెల్లవారుజామునే జురెక్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ... నిబంధనల ప్రకారం పైలెట్‌కు విశ్రాంతి ఇచ్చారని తెలిపారు.
ఇవీ చదవండి :