అంతర్జాతీయ స్థాయిలో విశాఖ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లాలూచీ వ్యవహారాలు తప్ప నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మెట్రో లైన్ గురించి ఏనాడైనా కనీసం సమీక్షించారా అని చంద్రబాబును ప్రశ్నించారు. పేదల ఇళ్లను కోర్టుల కేసుల పేరుతో ఆపేందుకు యత్నించారని బొత్స ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి