పండుగను సామూహికంగా చేసుకోవద్దని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇళ్లు, గుళ్లలో వినాయక చవితిని చేసుకోవద్దని ప్రభుత్వం చెప్పలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కొవిడ్ నిబంధనలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని చంద్రబాబును కోరుతున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.
మరోవైపు క్రీడా మంత్రికి ఆటల్లో ప్రవేశం ఉండాలి, కళల మంత్రికి డాన్సు వచ్చి ఉండాలన్న నియమం ఎక్కడా లేదని మంత్రి వ్యాఖ్యలు చేశారు. సాంస్కృతిక అకాడమీల నియామకాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. అకాడమీలకు నిపుణులైన వారినే నియమించాలని ఎక్కడా నిబంధనల్లేవని అన్నారు. అవి కేవలం రాజకీయపరమైన నామినేటెడ్ పోస్టులు మాత్రమేనని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ.. chavithi celebrations: వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్