శ్రీకాకుళం జిల్లా వంశధార నది పరివాహక ప్రాంతాల్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ (Minister Anil Kumar) పర్యటించారు. భామిని మండలం కాట్రగడ-బి వద్ద పనులను పరిశీలించారు. వంశధార ఫేజ్-2, స్టేజ్-2 పనులపై ఆరా తీశారు. నేరడి బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సమయంలో ఒడిశా నిర్వాసిత రైతులు మంత్రిని కలిశారు. బ్యారేజ్ నిర్మాణం వల్ల 400 కుటుంబాలకు పైగా నష్టపోతామని తెలిపారు. రీ సర్వే జరిపించి తమకు న్యాయం చేయాలని రైతుల విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్లపై మంత్రి అనిల్.. సానుకూలంగా స్పందించారు. నేరడి బ్యారేజ్ పనులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏపీకి కేటాయించిన వాటాలకు లోబడే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని మంత్రి అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని అన్నారు. వంశధార జలాశయానికి సంబంధించి అత్యవసరంగా కావాల్సిన షట్టర్స్తో పాటు లస్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. 87, 88 ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:
AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా