కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిథున్ రెడ్డి కలిశారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు, ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సహకారంపై చర్చించినట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. పోలవరానికి సంబంధించి ఏపీకి రావాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరామన్నారు. త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి చెప్పారు. పోలవరాన్ని సందర్శించాలని కేంద్రమంత్రిని ఆహ్వానించామన్నారు. 2021 డిసెంబర్ వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంగా సీఎం ముందుకెళ్తున్నారని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
కృష్ణా నదిపై ప్రాజెక్టులతో రాయలసీమకు కలిగే లబ్ధిపై వివరించాం. అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీ ఖరారు చేసి త్వరలో చెబుతామని కేంద్రమంత్రి అన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎప్పుడు నిర్వహించినా పాల్గొనేందుకు ఏపీ సిద్ధంగా ఉంది. --అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి
ఇదీ చదవండి : కొడాలి వ్యాఖ్యలపై భాజపా మండిపాటు..క్షమాపణకు డిమాండ్