రాష్ట్ర సమస్యల కోసమే దిల్లీ పర్యటన
కొంతమంది విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని...జగన్ దిల్లీ పర్యటనపైనా రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం దిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే అమిత్‌షాను కలుస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షాను సీఎం జగన్ కలవడంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. దిల్లీ పర్యటనలో అందుబాటులో ఉన్న మంత్రులందరినీ జగన్ కలుస్తారని వెల్లడించారు.
సీఎం దిల్లీ పర్యటనపై రాద్దాంతం సరికాదు: మంత్రి అనిల్ - రివర్స్ టెండరింగ్ తో లాభం వార్తలు
ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనపై తెదేపా నేతలు రాద్దాంతం చేయటం సరికాదని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే దిల్లీ పర్యటనకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో ఇప్పటివరకు జలవనరుల శాఖలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం జరిగిందని తెలిపారు.

minister anil kumar comments on CM jagan delhi tour
సీఎం దిల్లీ పర్యటనపై రాద్దాంతం సరికాదు:మంత్రి అనిల్
రివర్స్ టెండరింగ్‌తో జలవనరుల శాఖకు రూ. వెయ్యి కోట్లు ఆదా చేశామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన..వెలిగొండలో రివర్స్ టెండరింగ్ తో రూ. 62 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. జలవనరుల శాఖలో రూ. 1500కోట్ల ఆదాయం తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.రివర్స్ టెండరింగ్ తీసుకురాకపోతే ఈ మొత్తమంతా కొందరి జేబుల్లోకి వెళ్లేదని అన్నారు. గతంలో రివర్స్ టెండరింగ్ చేసి ఉంటే రూ.వేల కోట్లు మిగిలేవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దేవినేని విమర్శించడం సరికాదని మండిపడ్డారు. పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేస్తుంటే తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద కొనసాగుతోందని.. వరద వల్లే నదుల్లో ఇసుక తీయలేక కొరత తీర్చలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక కొరత త్వరలోనే తీరుతుందని తెలిపారు.