పోలవరం పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని...దానిపై పోరాటం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ యాదవ్ అన్నారు. పోలవరం కోసం ఖర్చు చేసిన రూ.2200 కోట్లు ఇవ్వాలని కోరామని...ఖర్చు చేసిన నిధులు అడిగితే ఆర్థికశాఖ కొత్త అంశం లేవనెత్తిందని మంత్రి అనిల్ మండిపడ్డారు. 2014-2016 వరకు కేవలం రూ.265 కోట్ల విలువైన పనులే చేశారన్న మంత్రి...2014 వరకు ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పటం దారుణమన్నారు. 2014 అంచనాలు ఆమోదించి నిధులు ఇవ్వాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పాత అంచనాలతో పోలవరం నిర్మాణం చేపట్టడానికి తాము సిద్ధంగా లేమన్నారు. రూ.30 వేల కోట్లు వ్యత్యాసం ఉంటే ప్రాజెక్టు ఎలా పూర్తిచేయగలమని మంత్రి ప్రశ్నించారు. పునరావాస, పరిహార ప్యాకేజీ కోసమే రూ.30 వేల కోట్లు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర జల సంఘం అంగీకరించిన మొత్తాన్ని ఇవ్వాల్సిందేనని...దీనిపై ప్రధానికి, జలశక్తి శాఖకు లేఖలు రాస్తామన్నారు. పీపీఏతో సంప్రదింపులు జరుపుతామని...అనుకున్న గడువులోపే ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు.
ఇదీ చదవండి: