బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా బెడ్స్, మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. అతి తక్కువగా నమోదు అవుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. బ్లాక్ ఫంగస్ సోకిన బాధితులకు అన్ని హాస్పిటల్స్లో ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
ఏ ఆస్పత్రిలోనైనా బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి వైద్యం నిరాకరిస్తే సంబంధిత ఆస్పత్రులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి