ETV Bharat / city

మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - cbn wishes to muslims of milad un nabi

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ముస్లింలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం వంటి ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు.

milad un nabhi wishes
milad un nabhi wishes
author img

By

Published : Oct 19, 2021, 10:53 AM IST

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ముస్లింలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్‌ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్‌ ఉన్‌ నబీని భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు. దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం వంటి ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు.

సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసిన దివ్యచరితుడు: చంద్రబాబు

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ముస్లింలకు తెదెపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసిన దివ్యచరితుడు ప్రవక్త అని చెప్పారు. శాంతియుత సహజీవనానికి, నవ నాగరికతకు అంకురార్పణ చేశారన్నారు.

మహమ్మద్‌ ప్రవక్త బోధనలు అమూల్యం: పవన్‌

‘‘మానవాళికి మహమ్మద్‌ ప్రవక్త అందించిన బోధనలు అమూల్యమైనవి. ప్రేమ, సోదరభావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని చెప్పిన మహ్మద్‌ ప్రవక్త జన్మదినం మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతరాలను రూపుమాపడానికి మహ్మద్‌ ప్రవక్త కృషిచేశారు: లోకేశ్‌

ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. అంతరాలను రూపుమాపడానికి మహ్మద్‌ ప్రవక్త కృషిచేశారని చెప్పారు.

ఇదీ చదవండి: రూ.765 కోట్లతో కొత్త ప్రాజెక్టు ఆ కంపెనీకేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.