ETV Bharat / city

తెలంగాణ: వరంగల్​లో దొరికిన ఐదో మృతదేహం ఎవరిది? - వరంగల్​లో వలస కూలీల మృతి వార్తలు

వరంగల్ గ్రామీణ‌ జిల్లా వలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో మరో మృతదేహం లభ్యమైంది. మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

migrant-worker-dead-
migrant-worker-dead-
author img

By

Published : May 22, 2020, 9:58 AM IST

తెలంగాణలోని వరంగల్ గ్రామీణ‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బావిలో మరో మృతదేహం లభ్యమైంది. నిన్న గొర్రెకుంటలోని బావిలో 4 మృతదేహాలు గుర్తించగా.. వాటిలో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. పోలీసులు బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల మృతదేహాన్ని తీయడం ఇబ్బందిగా మారింది.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 20 ఏళ్ల క్రితం బంగాల్‌ నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబమని స్థానికులు తెలిపారు. పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూలీల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.