ఉత్తర అండమాన్ సముద్రంలో అక్టోబరు 10న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత నాలుగైదు రోజుల్లో అది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతూ.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాల వైపు ప్రయాణిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
‘తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చు’ అని సూచించారు.