ETV Bharat / city

'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

మిగులు జలాల వినియోగానికి సంబంధించి మే చివరిలోగా తెలుగు రాష్ట్రాలు పూర్తి వివరాలు సమర్పించాలని కృష్ణా నదీ బోర్డు సాంకేతిక కమిటీ కోరింది. కరోనా కారణంగా ఇవాళ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై తాము గతంలోనే వివరాలు కోరినా ఇంకా అందలేదని తెలిపింది. వివరాలు ఇవ్వకుండా జాప్యానికి తమను బాధ్యుల్ని చేయవద్దని పేర్కొంది.

krishna river management board
http://10.10.50.krishna river management board 85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/13-May-2020/7181139_509_7181139_1589364147247.png
author img

By

Published : May 13, 2020, 3:40 PM IST

Updated : May 13, 2020, 8:20 PM IST

మిగులు జలాల వినియోగానికి సంబంధించి నెలాఖరులోగా రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి వివరాలు సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ కోరింది. మిగులు జలాల అంశంపై ఏర్పాటైన సాంకేతిక కమిటి ఇవాళ సమావేశమైంది. కొవిడ్-19 కారణంగా దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సమావేశం జరిగింది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ విజయ్ సరన్, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్​ మీనాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అంతర్ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు నరసింహారావు, నాగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.

మిగులు జలాలకు సంబంధించి తాము గతంలోనే వివరాలు కోరినా ఇంకా అందలేదని... వీలైనంత త్వరగా వివరాలు ఇవ్వాలని కమిటీ తెలిపింది. వివరాలు ఇవ్వకుండా జాప్యానికి తమను బాధ్యుల్ని చేయవద్దని వ్యాఖ్యానించింది. కేవలం ఒక సంవత్సరానికే కాకుండా పూర్తి స్థాయి విధివిధానాలు రూపొందించాలని తాము భావిస్తున్నట్లు సీడబ్ల్యూసీ సీఈ విజయ్ సరన్ తెలిపారు. 1980 నుంచి మిగులు జలాల వినియోగానికి సంబంధించి నెలాఖర్లోగా వివరాలు అందించాలని... అనంతరం వచ్చే నెల మొదటి వారంలో కమిటీ సమావేశమై విధివిధానాలపై కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు.

Last Updated : May 13, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.