రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్‌కో పరిధిలో విజయవాడ, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు 5వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. పూర్తి స్థాయి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో (పీఎల్‌ఎఫ్) పని చేస్తే ప్రతి నెలా సుమారు 12లక్షల టన్నుల బొగ్గు అవసరం. దీనికోసం తెలంగాణలోని సింగరేణి, ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. డిమాండు ఉన్న సమయంలో అక్కడి నుంచి బొగ్గు అంద[డం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మందాకిని బొగ్గు గనిని కేటాయించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. ఇవే గనుల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ప్రయత్నించాయి.
ఇదీ చదవండి: ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాం: సీఎం జగన్