ETV Bharat / city

SEED BALLS: విత్తన బంతులతో గిన్నిస్‌ రికార్డు - telangana latest news

తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నిస్​లో చోటు దక్కించుకుంది. లార్జెస్ట్ సీడ్ బాల్ సెంటెన్స్ పేరిట 73,918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రాసి ప్రపంచ రికార్డు సృష్టించింది. మహబూబ్​నగర్ రైల్వే కమ్యూనిటీ హాల్​లో జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ వాక్యాన్ని విత్తన బంతులతో వరుసగా పేర్చారు.

Guinness World Record for seed balls
విత్తన బంతులతో గిన్నిస్‌ రికార్డు
author img

By

Published : Jul 12, 2021, 9:31 PM IST

విత్తన బంతులతో పాలమూరు యంత్రాంగం గిన్నిస్‌ రికార్డు

మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నిస్​లో చోటు దక్కించుకుంది. లార్జెస్ట్ సీడ్ బాల్ సెంటెన్స్ పేరిట 73,918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రాసి ప్రపంచ రికార్డు సృష్టించింది. మహబూబ్​నగర్ రైల్వే కమ్యూనిటీ హాల్​లో జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ వాక్యాన్ని విత్తన బంతులతో వరుసగా పేర్చారు. అనంతరం అందుకు ఎన్ని విత్తన బంతులను వినియోగించారో లెక్కించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఎడ్యూరికేటర్ రిషినాథ్​, కంట్రీ ప్రతినిధి నిఖిల్ శుక్లా, లండన్ నుంచి ఆండ్రూఫ్ ఈ ప్రక్రియను ఆన్​లైన్​లో పర్యవేక్షించారు.

ఆన్​లైన్ ఆధారాలు, ఫొటో సాక్ష్యాలు, ఇతర నివేదికలు పరిశీలించిన అనంతరం విత్తన బంతులతో రూపొందిన అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లుగా తెలిపారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, పీజెడ్ఎంఎస్, డీఆర్డీఏ, మెప్మా, హెటెరో గ్రూప్​ల పేరిట రికార్డును నమోదు చేసినట్లు రిషినాథ్ ఆన్​లైన్ వేదికగా వెల్లడించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​కు అంకితం..

ఈ విజయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్​కు అంకితమిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. 'టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్​హెచ్​జీ ఉమెన్ ట్రాన్స్​ఫామ్ మహబూబ్​నగర్ ఇన్​టూ హెటెరో గ్రీన్ బెల్ట్​' అనే వాక్యాన్ని మహిళలు విత్తన బంతులతో రూపొందించారు.

ఇదీ చదవండి:

Kaushik Reddy: రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ చీఫ్​ అయ్యాడు: కౌశిక్ రెడ్డి

సూపర్ స్టార్ దత్తత గ్రామంలో 100 శాతం వాక్సినేషన్ పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.