Amaravati Farmers Padayatra : అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. రైతుల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా 'మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు' అంటూ రైతులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
రైతులు వెళ్తున్న మార్గంలో ఉన్న స్కూల్ విద్యార్థులు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజలు అమరావతి రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు భారీ జాతీయజెండాను ప్రదర్శిస్తూ రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. మహా పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి రైతులకు శీతల పానీయాలు అందిస్తున్నారు. మహిళలు స్వామి వారి రథానికి కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: