ETV Bharat / city

WEATHER UPDATE: 15 నాటికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - rain in andhrapradesh

దక్షిణ అండమాన్ సముద్రం ఆ పరిసర ప్రాంతాలపై ఇవాళ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. నవంబరు 15 తేదీ నాటికి ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడనం వాయుగుండగా మారే సూచనలు
అల్పపీడనం వాయుగుండగా మారే సూచనలు
author img

By

Published : Nov 13, 2021, 3:12 PM IST

Updated : Nov 14, 2021, 4:37 AM IST

రాష్ట్రానికి మరో వాయు‘గండం’ పొంచి ఉంది. థాయ్‌లాండ్‌, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి నవంబరు 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 18 నాటికి రాష్ట్ర తీరానికి చేరే అవకాశం ఉందని, ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టత రావాల్సి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ‘ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం.. అక్కడి నుంచి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బంగా వరకు ద్రోణి ప్రభావంతో.. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

శ్రీకాకుళంలో కుండపోత

రాష్ట్రంలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. అధికశాతం ప్రాంతాల్లో చినుకులు పడుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల మధ్య శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల కుండపోత వానలు కురిశాయి. ఇచ్చాపురంలో 15.8, కవిటిలో 12.3, పలాసలో 12.3, సోంపేట 10.4, కంచిలి 9.5 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. విశాఖపట్నం జిల్లా పరవాడ 10.8, అచ్యుతాపురం 9.7, బుచ్చాయపేట 7.6, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 8.7 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

* ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురు వానలు కురిశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, కనిగిరి, కందుకూరు, సీఎస్‌పురం, కడప జిల్లా ఓబుళవారిపల్లె, పులివెందుల, తాండూరు, శ్రీకాకుళం జిల్లా పలాస, గార, గోళ్లపాడు, నెల్లూరు జిల్లా కావలి, పొదలకూరు, అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతాల్లో 2 సెం.మీ నుంచి 3.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి:

ఇద్దరు గ్రామస్థులను కాల్చిచంపిన మావోయిస్టులు

Last Updated : Nov 14, 2021, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.