అమరావతిని చంపేందుకు ప్రభుత్వం, వైకాపా నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రాధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. అమరావతి ఉద్యమం 300 రోజుకు చేరిన సందర్భంగా పెనుమాకలో ఎంపీ గల్లా జయదేవ్, తెదేపా నేతలతో కలిసి ఆయన రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపారు. అమరావతి గడ్డపైన గడ్డినైనా తొలగించలేరని లోకేశ్ అన్నారు.
అమరావతి ప్రాంతాన్ని, ఉద్యమాన్ని కించపరిచేలా మంత్రులు, వైకాపా నేతలు ఇష్టానుసారం మాట్లాడినా.. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని లోకేశ్ అన్నారు. 90 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటంలో ముందుంటామని లోకేశ్, గల్లా జయదేవ్ అన్నారు. పెనుమాక నుంచి ఎర్రబాలెం చేరుకొని అక్కడి రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావ ప్రకటించారు. తర్వాత కృష్ణయ్యపాలెంలోనూ రైతలు బాసటగా నిలిచారు.
ఇదీ చదవండి: అనంతపురం కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య