జగన్ 100రోజుల పాలనను ట్విట్టర్ వేదికగా లోకేశ్ ఎత్తిచూపారు. 'తుగ్లక్ 2.0 వంద రోజుల పాలనలో ధర్నా చౌక్ ఫుల్, అభివృద్ధి నిల్' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అమరావతిని ఎడారి చేశారని మండిపడ్డారు. పోలవరాన్ని మంగళవారంగా మార్చారని, 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారని విమర్శించారు. ఇంత చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదని దుయ్యబట్టారు. ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారని, ప్రజలు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాత్రం దానికి వంద రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా అన్న లోకేష్...ఇంత దానికి ప్రజల సొమ్ము దండగ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
ఈనెల 29 నుంచి విజయవాడ దుర్గమ్మ ఉత్సవాలు