గత మూడేళ్లుగా, పరిపాలన అంతా ఇక్కడ నుంచే సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా, పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగించవచ్చని తెలిపారు. అమరావతిలో అన్ని సౌకర్యాలు అమరిన తర్వాత కూడా రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముందని లోకేశ్ ప్రశ్నించారు.
రాజధానిని విశాఖకు మారిస్తే... ఈ భవనాలను ఏం చేస్తారో తెలపాలన్నారు. ఈ భవనాలను ప్రజావేదికలా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్నవి కూల్చేసి కొత్త వాటి కోసం అదనంగా ఖర్చు చెయ్యటం తెలివి తక్కువ పని కాదా అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి :