ఏపీపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకుంటే మరో పోరాటానికి సిద్ధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. ఇది 6వేల మంది పైచిలుకు అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదని, భవిష్యత్ నిర్వాహకులను ఎన్నుకునే విశ్వసనీయ వ్యవస్థ ఏపీపీఎస్సీ అని గుర్తించాలని సూచించారు. గతేడాది ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తొందరపాటు చర్యలతో పరిశీలన లేని డిజిటల్ మూల్యాంకనం, అభ్యర్థుల ఏకపక్ష ఎంపిక, పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం లాంటివి చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. గత పొరపాట్లు, మూల్యాంకన లోపాలు పునరావృతం కాకుండా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టాలని లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: