ETV Bharat / city

'తుది తీర్పుకు లోబడే కర్నూలులో లోకాయుక్త, హెచ్​ఆర్​సీ'

కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాల ఏర్పాటు వ్యవహారం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ఆ కార్యాలయాలుకర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయం అంతిమం కాదని వ్యాఖ్యానించింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Sep 1, 2021, 3:33 AM IST

కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాల ఏర్పాటు వ్యవహారం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ఆకార్యాలయాలుకర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయం అంతిమం కాదని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి ఐకాస నేత, డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాదబాబు వాదనలు వినిపించారు. కర్నూలులో లోకాయుక్త , ఏపీ హెచ్ ఆర్సీ ఏర్పాటు చేయడం ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ తరపున వాదించారు.

ఏపీసీఆర్డీఏ చట్ట ప్రకారం రాజధాని నగరం అమరావతి గ్రామాల పరిధిలో శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ఏర్పాటు చేశారన్నారు. విధులు నిర్వహిస్తున్నాయన్నారు. పరిపాలనకు సంబంధించిన శాసన, న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు రాజధానిలో ఉండాలన్నారు . అప్పట్లో ప్రభుత్వం అమరావతిలో న్యాయనగరం ఏర్పాటుకు ప్రతిపాదించింది. భూములు కేటాయించిందన్నారు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన విభాగాలన్నింటిని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనానికి తెలిపారు. న్యాయనగరాన్ని ప్రకటించాక రాష్ట్రస్థాయి జ్యుడీషియల్, క్వాసీ జ్యుడీషియల్ వ్యవస్థలను రాజధాని ప్రాంతంలో ఉంచాలన్నారు.

జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి ఆయ్యాక .. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తీసుకు వచ్చారన్నారు. ఆ చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది . ఈ నేపథ్యంలో కర్నూలులో లోకాయుక్త, హెచ్ఆర్​సీ ఏర్పాటు సరికాదని తెలిపారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని అలాంటి ప్రాంతాన్ని వదిలేసి దూరంగా ఉన్న కర్నూలులో ఏర్పాటు చేయడం న్యాయాన్ని ప్రజలకు దూరం చేయడమేనన్నారు. విజయవాడలో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం రూ .1.42 కోట్లు ఖర్చుచేసిందన్నారు. భవనం సిద్ధంగా ఉంది , కర్నూలులో హెచ్​ఆర్​సీ, లోకాయుక్త ఏర్పాటుకు ప్రభుత్వం వద్ద సహేతుకమైన కారణాలు లేవన్నారు. ఇంకా కర్నూలులో హెచ్ ఆర్​సీ ఏర్పాటు చేయలేదన్నారు. దాని ఏర్పాటుపై స్టే ఇవ్వండి ' అని కోరారు.

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చడంపై ధర్మాసనం ప్రశ్నించగా .. పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ముఖ్యమంత్రిని, మంత్రులను ప్రతివాదులుగా పేర్కొన్నామని, న్యాయస్థానం వారికి నోటీసులు జారీచేసిందని న్యాయవాది బదులిచ్చారు.

ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు . కర్నూలులో హెచ్ ఆర్సీ , లోకాయుక్త ఏర్పాటుకు పాలన వికేంద్రీకరణ చట్టంలో సంబంధం లేదన్నారని ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు.

కర్నూలులో ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అక్కడ ఏర్పాటుకు సహేతుకమైన కారణాలున్నాయన్నారు . అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు . ఇప్పటికే లోకాయుక్త కర్నూలుకు వచ్చిందన్నారు. హెచ్ఆర్​సీ సైతం కర్నూలులో బుధవారం నుంచి విధులు నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. ఇలాంటి సంప్రదాయానికి అడ్డుకట్ట వేయాలన్నారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి, మంత్రులను ప్రతివాదులగా పేర్కొనడం సరికాదన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం .. కర్నూలులో ఏపీ లోకాయుక్త , రాష్ట్ర హెచ్ఆర్​సీ ఏర్పాటు అంశం తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. గతంలో ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఏపీ హెచ్ఆర్ సీ హైదరాబాద్ లో కాకుండా ఏపీలో ఏర్పాటు చేయాలని స్పష్టంచేసినట్లు గుర్తుచేసింది. కర్నూలులో హెచ్​ఆర్​సీ ఏర్పాటును నిలువరించాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదు.

ఇదీ చదవండి:

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరిస్తాం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.