తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాల జోరు కొనసాగుతోంది. గత ఆరేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుత మద్యం విధానంలో గడచిన రెండేళ్లలోనే రూ.50 వేల కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. ఈ వ్యవధిలో 19 కోట్లకుపైగా కేస్‌ల లిక్కర్ అమ్ముడవగా, సుమారు 23 కోట్లకు పైగా బీర్ కేస్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది దాదాపు రూ.25,601 కోట్ల విక్రయాలు జరగ్గా.. ఈసారి నవంబరు 20 నాటికే ఆ అమ్మకాలను అధిగమించారు.
ఏడాది చివరిలోగా మరో రూ.2-3 వేల కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయని ఆబ్కారీ శాఖ చెబుతోంది. డిసెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త మద్య విధానంలో అమ్మకాలు రూ.60 వేల కోట్లు దాటతాయనే అంచనాతో ఉన్నారు. అదే సమయంలో కొవిడ్ లాక్‌డౌన్ అనంతరం మద్యం దుకాణాలు తెరుచుకున్న సమయంలో దాదాపు 20శాతం మేర ధరలు పెరగడం ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.
జిల్లాలవారీగా చూస్తే అత్యధిక అమ్మకాలు రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాల్లో దాదాపు ఆరో వంతు ఈ జిల్లాలోనే ఉంది. గద్వాల జిల్లాలో అతి తక్కువ విక్రయాలు నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి: