ETV Bharat / city

మందు బాబులకు శుభవార్త.. మద్యం ధరలు తగ్గించిన సర్కారు - liquor price decrease in ap

liquor price decrease in ap
ఏపీలో మద్యం ధరలు తగ్గింపు
author img

By

Published : Oct 29, 2020, 5:21 PM IST

Updated : Oct 29, 2020, 6:23 PM IST

17:16 October 29

మద్యం ధరలు తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్ విడుదల

 మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం ధరల్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలు తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్​ను అబ్కారీశాఖ విడుదల చేసింది. భారత్​లో  తయారయ్యే విదేశీ మద్యం, విదేశీ మద్యాల మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరలను తగ్గించారు. రూ.50 నుంచి రూ. 1350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరల తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు అక్టోబరు 30 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని ప్రభుత్వం పేర్కొంది. రూ.200 లోపు క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పు లేదని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. రూ.200  దాటిన క్వార్టర్ బాటిల్ ధరలను ప్రస్తుతం తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చారు. బ్రాండ్లు, బాటిళ్ల పరిమాణాలను అనుసరించి 90 ఎంఎల్ కు రూ.50  నుంచి లీటరు మద్యం ధర రూ.1350 వరకూ తగ్గిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఈ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్ఈబీ నివేదిక ఆధారంగా మద్యం ధరలను సవరించినట్టు అబ్కారీ శాఖ తెలిపింది. ఛీప్​ లిక్కర్​తోపాటు ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఎస్ఈబీ నివేదిక ఇవ్వటంతో ఈ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అబ్కారీ శాఖ వెల్లడించింది.

2020 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్య కాలంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 1211 కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణా నుంచి 630, కర్ణాటక నుంచి 546, ఒడిశా నుంచి 24, తమిళనాడు నుంచి 11 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణా, కర్ణాటకల్లో మద్యం ఎమ్మార్పీ ధరలు ఏపీ కంటే రెండింతలు తక్కువ కావటంతోనే స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఎస్ఈబీ నివేదిక ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఏపీ మండలాల్లోనే మద్యం పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ జరుగుతోందని ఎస్ఈబీ నివేదిక ఇచ్చినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: నవంబర్‌ 2 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం షెడ్యూల్​ విడుదల

Last Updated : Oct 29, 2020, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.