సేవా రుసుంల కింద వచ్చిన ఆదాయంలో 40% నుంచి 50% నిధులను గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు కేటాయించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడున్న 545తో పాటు అదనంగా మరో 200 సేవలను ప్రవేశ పెట్టనున్నారు. 51 చోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్, మరో 300 చోట్ల ఆధార్ వంటి సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు ఏటా దాదాపు రూ.50 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇందులో వాలంటీర్ల మొబైల్ ఛార్జీలకే ఏడాదికి రూ.30 కోట్లు అవుతోంది.
అంతర్జాలం, స్టేషనరీ ఖర్చు, సాఫ్ట్‌వేర్ నిర్వహణ చూసే సంస్థలకు చెల్లింపుల కోసం మరో రూ.20 కోట్లు అవసరమవుతున్నట్లు అంచనా. సచివాలయాల వ్యవస్థను ప్రారంభించాక ఒక్కో కార్యాలయం నిర్వహణకు ఒకసారి రూ.వెయ్యి, ఇంకోసారి రూ.1,500, తాజాగా రూ.2,500 చొప్పున కేటాయించారు. నిధులు సరిపోవడం లేనందున సేవల సంఖ్యతో పాటు రుసుంల ఆదాయాన్ని పెంచుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదనపు సేవలతో ఇప్పుడు ఏటా వస్తున్న రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల ఆదాయం రూ.75 కోట్లకుపైగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: TIDCO houses : రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు...