ETV Bharat / city

విశాఖ గ్యాస్ లీకేజ్: ఇక్కడే ఉంటాం.. సహకరిస్తాం - Vizag gas leak

దక్షిణ కొరియా నుంచి ఎల్‌జీ బృందం విశాఖపట్నానికి వచ్చింది. ఈ బృందానికి తమ పెట్రోకెమికల్‌ కంపెనీ ఛైర్మన్‌ కుగ్‌ లే నో సారథ్యం వహిస్తున్నట్లు కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.బాధితుల పునరావాసానికి ఉన్నత ప్రమాణాలతో చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

LG South Kore
LG South Kore
author img

By

Published : May 14, 2020, 6:47 AM IST

దక్షిణ కొరియా నుంచి ఎల్‌జీ బృందం విశాఖపట్నానికి వచ్చింది. 8 మంది సాంకేతిక నిపుణులతో కూడిన ఈ బృందం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంది. అక్కడ సభ్యులందరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకుని, అనంతరం ప్లాంట్‌కు చేరుకున్నారు. ఈ బృందానికి తమ పెట్రోకెమికల్‌ కంపెనీ ఛైర్మన్‌ కుగ్‌ లే నో సారథ్యం వహిస్తున్నట్లు కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ బృందం కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటుందని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న పరిస్థితులన్నింటినీ మెరుగుపరుస్తామని, పూర్తిస్థాయి నివారణ చర్యలు చేపట్టేందుకు సహకరిస్తామని వివరించారు. బాధితుల పునరావాసానికి ఉన్నత ప్రమాణాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారిని పూర్తిస్థాయిలో ఆదుకోవటమే తమ ప్రథమ ప్రాధాన్యాంశమని స్పష్టం చేశారు. ఛైర్మన్‌ ఆధ్వర్యంలో బృందమంతా బాధిత గ్రామాల్లో పర్యటించి కుటుంబాల్ని కలుస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జరిగే సమీక్షల్లోనూ పాల్గొంటారని తెలిపారు.

ట్యాంకర్లతో స్టైరీన్‌ తరలింపు
ఎల్‌జీ పాలిమర్స్‌లో ఓ ట్యాంకులో భారీగా నిల్వ ఉన్న స్టైరీన్‌ను తరలించేందుకు ఆ పరిశ్రమ ఏర్పాట్లు చేసింది. బుధవారం మరిన్ని ట్యాంకర్లతో పోర్టుకు తరలించింది. ఎన్ని ట్యాంకర్ల స్టైరీన్‌ బయటికి వెళ్తోందనేది ప్రభుత్వం వేసిన కమిటీలు పర్యవేక్షించాయి. మరోవైపు.. లీకేజీ ఘటనపై ఇప్పటికే అనేక బృందాలు విచారణ చేస్తున్నాయి. గ్రామాల్లో పర్యటిస్తూ, పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడుతున్నాయి. ఇంతవరకు ఏ విచారణా ఇంకా కొలిక్కి రాలేదు.

ఘటన దురదృష్టకరం
స్టైరీన్‌ విషవాయువు లీకైన ఘటనపై ఎల్‌జీ కెమ్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ విషయాన్ని పరిశ్రమ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన రూపంలో ఉంచింది. తమ పరిశ్రమలు అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేస్తాయని, ఈ ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యత తీసుకుంటామని తెలిపింది.

ఇదీ చదవండి :

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌ సమీపంలో ప్రస్తుత పరిస్థితుల దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.