పట్టణ రోడ్లు, పల్లె రహదారులు, హైవేలు.. అనే తేడా లేకుండా ఎక్కడైనా ఈ మార్కింగ్‌లను మనం గమనించవచ్ఛు గీతలు, ప్యాటర్న్‌లు, పదాల సంజ్ఞల రూపంలో ఉంటాయివి. ఇందులో సెంటర్ లైన్ మార్కింగ్, ట్రాఫిక్ లేన్ మార్కింగ్, బోర్డర్ లేదా ఎడ్జ్ లైన్లు, వార్నింగ్ లైన్లు, నో పాసింగ్ జోన్లు, బస్ లేన్ అనే రకాలుంటాయి. స్టాప్, స్లో, బస్, కీప్ క్లియర్, స్కూల్, రైట్ టర్న్ ఓన్లీ, ఎగ్జిట్ ఓన్లీ.. ఇలాంటి పదాలూ గీతల్లో భాగమే. వీటి అర్థం తెలిస్తే మన ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ముందుకు సాగుతుంది.
తెలుపు: అన్నిరకాల సంజ్ఞలకు తెలుపు రంగు వాడతారు.
పసుపు: ముందు అవరోధాలు ఉన్నాయి అనడానికి సంకేతం.
నలుపు: తెలుపునకు ప్రత్యామ్నాయం. పాదచారుల కాలిబాటలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.
బ్రోకెన్ తెలుపు గీతలు
ఇండియాలో అత్యధికంగా కనిపించే రోడ్డు మార్కింగ్. దీనర్థం వాహనదారుడు రోడ్డు మీద వెళ్తుంటే కావాలనుకున్నప్పుడు వరుసలు మారొచ్ఛు ముందున్న వాహనాలను ఓవర్‌టేక్ చేయొచ్ఛు యూటర్న్ తీసుకోవచ్చు అని అర్థం. అయితే ఇవన్నీ చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెనకాముందు చూడాలి అని ఈ గీత చెబుతుంది.
ఏకధాటి (సాలిడ్) తెలుపు గీతలు
ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయొద్ధు యూటర్న్ తీసుకోవద్దు అని ఈ రేఖ చెబుతుంది. అంటే ముందు ప్రమాదకర పరిస్థితులున్నాయి.. వెలుతురు సరిగా లేదు.. అని. అయినా ఈ రోడ్డు నుంచి బయటికి వెళ్లాలి, యూటర్న్ తీసుకోవాలి అనుకుంటే ఆ సాలిడ్ గీత ముగిసి ఏదైనా కూడలి వచ్చినప్పుడు మీరు చేయాలనుకున్నది నిరభ్యంతరంగా చేయొచ్ఛు
రెండు వరుసల పసుపు గీతలు
దీనర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ వరుస మారొద్ధు ముందు వాహనాల్ని దాటొద్ధు ఏదైనా అతిపెద్ద అడ్డంకి ఉంటే తప్ఫ కూడలిలో సిగ్నళ్లు పడినప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి. వెడల్పు తక్కువగా ఉండే రెండు వరుసల రహదారికి మాత్రమే ఇలాంటి గీతలు వాడతారు.
పసుపు గీత పక్కన బ్రోకెన్ పసుపు రేఖ
ఇందులో రెండు అర్థాలున్నాయి. బ్రోకెన్ లైన్ వైపు మనం ఉంటే ముందు వెళ్తున్న వాహనాన్ని దాటుకొని వెళ్లవచ్ఛు సాలిడ్ పసుపురంగు గీత వైపు డ్రైవింగ్‌లో ఉంటే ఓవర్‌టేక్ చేయడానికి వీల్లేదు.●
స్టాప్ లైన్: ఆ గీత కన్నా ముందే ఆగిపోవాలి. వాహనాన్ని ముందు ఆపాలి.●
గివ్ అవే లైన్: తిరగేసిన త్రిభుజాకారపు గుర్తు. రెండు వరుసల చుక్కల లైన్లు జంక్షన్ల దగ్గర కనిపిస్తాయి. మనం నడిపే వాహనం ప్రధాన రహదారిపైకి వస్తున్నప్పుడు అటూఇటూ చూసుకొని వాహనాలకు, ట్రాఫిక్‌కి అడ్డుపడకుండా వెళ్లాలి.●
బోర్డర్ ఎడ్జ్ లైన్స్: రహదారి ముగిసేవరకూ ఇవి ఉంటాయి. సాధారణంగా తెలుపు రంగులో వేస్తారు. వాహనాలు ఈ గీతను దాటి బయటికి వెళ్లడం ప్రమాదకరం అని చెప్పడమే దాని ఉద్దేశం. ఒకవేళ వాహనాన్ని పార్క్ చేయాల్సి వస్తే ఈ గీతకి బయటే నిలపాలి.●
యెల్లో బాక్స్ జంక్షన్: రోడ్డు మధ్యలో ఇంటర్‌సెక్షన్‌లో వేస్తారు. దీనిపై నుంచి ఇరుపక్కల ద్వారా వాహనాలు వెళ్లొచ్ఛు ఇతర అడ్డంకులేమీ లేనప్పుడు, వేరే వాహనాలు బాక్స్ గుండా వెళ్లనప్పుడు మాత్రమే ఈ బాక్స్ ద్వారా మలుపు తీసుకోవచ్ఛు●
పెడెస్ట్రియిన్ క్రాసింగ్: వీటినే జీబ్రా క్రాసింగ్ అంటుంటారు. నలుపు, తెలుపుల స్ట్రిప్‌లతో గుర్తులు వేస్తారు. సాధారణంగా కూడళ్లలో ఈ గుర్తులుంటాయి. సిగ్నల్ పడ్డప్పుడు పాదచారులు తప్పకుండా వీటి ద్వారానే రోడ్డు దాటాలి. ఆ సమయంలో చోదకులు వాహనాలను ఆపేయాలి.●
రంబుల్ స్ట్రిప్‌లు: పట్టీల్లా రోడ్డుపై కొంచెం ఉబ్బెత్తుగా వేసే గీతలివి. వాహనాలు వీటిపై నుంచి వెళ్తుంటే చిన్నపాటి శబ్దం వస్తుంది. నిద్రమత్తులో, పరాకుగా ఉన్న డ్రైవర్లను అప్రమత్తం చేయడానికే ఈ ఏర్పాటు.●
త్రీడీ జీబ్రా క్రాసింగ్‌లు: అహ్మదాబాద్‌కి చెందిన ఇద్దరు మహిళలు రూపొందించారు. మామూలు గీతలతో పోలిస్తే దూరం నుంచి సైతం ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. డ్రైవర్లు అప్రమత్తం కావొచ్ఛు పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటొచ్ఛు
రోడ్డుపై రకరకాల వాహనాలు తిరుగుతుంటాయి. ఏవి ఎటువైపు వెళ్తున్నాయో తెలియదు. ఈ గందరగోళం తప్పించడానికే రోడ్డు మార్కింగ్‌లు.
ఇవి దారి చూపడమే కాదు.. ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరిస్తాయి. జామ్‌లు లేకుండా చేస్తాయి.
నిబంధనలు పాటిస్తే, రోడ్డు గీతలపై అవగాహన ఉంటే ప్రయాణం భద్రంగా ఉంటుంది. ప్రమాదాలు తగ్గడానికి ఆస్కారం.
ఎక్కడ ఆపాలో, ఎక్కడ పార్కింగ్ చేయాలో, ఎక్కడ యూటర్న్ తీసుకోవాలో చిన్న చిన్న సమాచారం సైతం తేలిగ్గా తెలుస్తుంది.
ఇరుకు రోడ్లు, వంతెనలు, మలుపులు.. ఇలాంటి అడ్డంకులను సైతం తెలియజేస్తూ ప్రమాదాలను నివారిస్తాయి.