Legal Awareness Seminars for farmers: అమరావతి రైతులకు న్యాయ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ నేషనల్ లీగల్ అథారిటీకి.. రైతాంగ పోరాట వేదిక కన్వీనర్ తన్నీరు వెంకటేశ్వర్లు లేఖ రాశారు. ప్రజలకున్న ప్రాథమిక హక్కులు, ఏపీసీఆర్డీఏ చట్టం, లాండ్ పూలింగ్, సీఆర్పీసీ 144 , ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుపై రాజధాని ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలకు న్యాయ అవగాహన సదస్సులు అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రైతులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని.. డిమాండ్ చేశారు. మృతి చెందిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. మరోసారి నేషనల్ లీగల్ అథారిటీని నేరుగా కలిసి లేఖను అందజేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి: అమరావతిపై అదే నిర్లక్ష్యం..రాజధాని నిర్మాణానికి కేటాయింపులు సున్నా !