అది రాష్ట్ర సచివాలయం...పాలనంతా కొనసాగేది అక్కడి నుంచే..కానీ సచివాలయ నిర్వహణ పాలన మాత్రం నిర్లక్ష్యానికి నిలువుటద్దాన్ని తలపిస్తోంది.
రాష్ట్ర సచివాలయంలో ఏసీలు, లైట్లు, లిఫ్టులు వంటి పరికరాల నిర్వహణ అధ్వానంగా తయారయ్యింది. ఏసీలు సరిగా నిర్వహించకపోవడంతో నీళ్లు కారుతున్నాయి. దీంతో ఉద్యోగుల విధులకు అంతరాయం కలుగుతోంది. వర్షం కురుస్తున్న సమయంలో కచ్చా ఇళ్ల తరహాలోనే ఏసీ ల నుంచి కారుతున్న నీళ్ళను బకెట్లతో పట్టాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఏసీల నుంచి కారుతున్న నీళ్ల కారణంగా కంప్యూటర్లు, ప్రింటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవుతున్నాయి. ఈ నీళ్లను పట్టేందుకు ఉద్యోగులు నానా తంటాలు పడాల్సివస్తోంది. ఏసీలు లిఫ్ట్ నిర్వహణ కోసం ప్రభుత్వం అరకొరగా నిధులు ఇస్తుండడంతో దీన్ని నిర్వహించాల్సినటువంటి కాంట్రాక్టర్ మొహం చాటేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కొన్ని బ్లాక్లలోని ఏసీ యంత్రాలు పని చేయకపోవడంతో మంత్రులు, ఉన్నతాధికారులు ఛాంబర్ వైపు కనీసం చూడటం లేదు. సచివాలయంలోని ఐదు బ్లాక్లలోనూ పైకప్పులు సైతం పగిలి వర్షపు నీళ్లు లోపలికి కారుతుండటంతో విధులకు ఆటకం కలుగుతోంది. ఇప్పటికైనా పరిస్థితిని గమనించి సౌకర్యాలు మెరుగుపరచాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :