ETV Bharat / city

ప్రభుత్వం వేధిస్తోంది.. అండగా ఉండండి: జడ్జి రామకృష్ణ - ప్రభుత్వం వేధిస్తోందని తెలిపిన జడ్జి రామకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని జడ్జి రామకృష్ణ అన్నారు. తనకు అండగా నిలవాలని ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ఆయన కోరారు. జడ్జి రామకృష్ణపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు.

lawyer ramakrishna
గుంటూరు సీపీఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం
author img

By

Published : Jul 20, 2020, 10:01 AM IST

‘రాష్ట్ర ప్రభుత్వం నన్ను వేధిస్తోంది. మీరంతా నాకు అండగా నిలవాలి’ అని జడ్జి రామకృష్ణ ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను కోరారు. దళితులపై దాడులకు నిరసనగా ఆదివారం గుంటూరు సీపీఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. వైకాపా ప్రభుత్వం దళిత జాతిపై దాడులను ప్రోత్సహిస్తోందనడానికి తనపై జరిగిన దాడే నిదర్శనమని జడ్జి రామకృష్ణ అన్నారు. ఎంతకాలం తమపై దాడులు చేస్తారో చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓట్లేసి గెలిపించినందుకు దళితులపై వైకాపా కక్ష తీర్చుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గతంలో వైద్యులు సుధాకర్‌, అనితారాణిలను వేధించారన్నారు. కర్నూలు జిల్లాలో కలెక్టర్‌ను అధికార పార్టీ ప్రజాప్రతినిధి దూషించడం దారుణమన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలను మందలించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు. జడ్జి రామకృష్ణపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై దిల్లీలో పార్లమెంటు సభ్యులు పోరాడాలని కోరారు. అధికార పార్టీ తగిన చర్యలు చేపట్టకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

జడ్జి రామకృష్ణకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. జడ్జి రామకృష్ణపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలని పలువురు దళిత నేతలు సమావేశంలో తీర్మానం చేశారు.

ఇదీ చదవండి:

ఈనెల 20 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.