ETV Bharat / city

లాయర్ దంపతుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ మేనల్లుడి పాత్ర - లాయర్ దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ మేనల్లుడి పాత్ర

రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కుంట శ్రీనివాస్​ పేరు ప్రచారంలో ఉండగా.. తాజాగా బిట్టు శ్రీనివాస్​ అనే వ్యక్తి ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. బిట్టు శ్రీనివాస్‌ ఇంకా తమకు చిక్కలేదని పోలీసులు ప్రకటించారు. అతడు దొరికితే.. ఈ ఉదంతంలో ఇంకెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావచ్చని భావిస్తున్నారు.

లాయర్ దంపతుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ మేనల్లుడి పాత్ర

author img

By

Published : Feb 19, 2021, 6:19 AM IST

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారు ఇవ్వడంతో పాటు హత్యకు వినియోగించిన రెండు కత్తులనూ బిట్టు శ్రీనివాస్‌ అనే వ్యక్తి సమకూర్చాడని పోలీసులు వెల్లడించారు. అతడు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌కు మేనల్లుడు కావడంతో ప్రాధాన్యం సంతరించుకొంది. పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్‌ బాధ్యతల్ని ఇతడే చూస్తుంటాడు. కత్తుల్ని మంథనిలో ఓ పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. ఆ దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందినది కావడం గమనార్హం. ఆ ప్రజాప్రతినిధిని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని తెలుస్తోంది. అయితే బిట్టు శ్రీనివాస్‌ ఇంకా తమకు చిక్కలేదని పోలీసులు ప్రకటించడంతో అతడు దొరికితే ఇంకెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావచ్చని భావిస్తున్నారు. పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా బిట్టు శ్రీను పాత్రను పోలీసులు ఉటంకించడం సంచలనం రేకెత్తిస్తోంది.

ముగ్గురిని పట్టుకున్నాం: ఐజీ

ఈ జంటహత్యల కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు గురువారం రాత్రి ఐజీ నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌లతో పాటు విలోచవరం గ్రామానికి చెందిన శివందుల చిరంజీవి కలిసి వామన్‌రావు దంపతులను చంపాలని పథకం వేసుకున్నారు. కుంట శ్రీనివాస్‌ తనకు తోడుగా కుమార్‌ను తీసుకెళ్లారు. వీరికి పుట్ట లింగమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షుడు, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌ మేనల్లుడైన తులిసెగారి శ్రీను అలియాస్‌ బిట్టు శ్రీను తన కారుతో పాటు కొబ్బరి బొండాలు నరికే రెండు కత్తులను సమకూర్చాడు. కారును చిరంజీవి నడపగా కుంట శ్రీను పక్కన కూర్చున్నాడు.

లాయర్ దంపతుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ మేనల్లుడి పాత్ర
లాయర్ దంపతుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ మేనల్లుడి పాత్ర

చిరంజీవిదే డ్రైవింగ్ పాత్ర...

వామన్‌రావు, నాగమణిల కంటే ముందుగానే చిరంజీవి వేగంగా కారు నడిపి కల్వచర్ల వద్ద కాపు కాశారు. అక్కడ రహదారి పనులు జరిగిన చోట వాహనాలు నెమ్మదిగా వెళ్తాయని భావించి అక్కడే వామన్‌రావు కారును అడ్డగించి అద్దాన్ని కత్తులతో బద్దలుకొట్టారు. డ్రైవర్‌ సతీష్‌ భయపడి కారు దిగి పారిపోయాడు. వామన్‌రావు వెంటనే డ్రైవింగ్‌ సీట్లోకి వచ్చి కారు నడిపేందుకు ప్రయత్నిస్తుండగా కుంట శ్రీను అతన్ని బయటకు లాగి కత్తులతో పాశవికంగా దాడి చేశాడు. చిరంజీవి కారుకు రెండోవైపు నుంచి వచ్చి నాగమణిపై కత్తితో దాడిచేయగా ఆమె తీవ్ర గాయాలకు గురై కారు సీట్లోనే పడిపోయింది. తర్వాత చిరంజీవి కూడా వామన్‌రావు వద్దకు వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనను అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. వామన్‌రావును నీపై ఎవరు దాడి చేశారని అడిగితే కుంట శ్రీనివాస్‌తో పాటు మరొక వ్యక్తి అని చెప్పారు. దాడి అనంతరం కుంట శ్రీను, చిరంజీవి కారులో సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లి అక్కడ రక్తపు మరకలంటిన దుస్తులను తీసేశారు. కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పారవేశారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోతూ తెలంగాణ పోలీసులు తనిఖీ చేస్తున్నారనే అనుమానంతో ముంబయి మార్గానికి వెళ్తుండగా వాంకిడి- చంద్రపూర్‌ మధ్యలో పట్టుకున్నాం. మూడో నిందితుడైన అక్కపాక కుమార్‌ కారులో స్వగ్రామానికి వెళ్లగా మంథని పట్టణంలోనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన అనుమానితులను కూడా కస్టడీకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తాం’ అని ఐజీ తెలిపారు. ఈ సమావేశంలో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, డీసీపీ రవీందర్‌ పాల్గొన్నారు.

హత్యకు గల కారణాలివే..

గుంజపడుగు గ్రామంలోని రామాలయ కమిటీకి సంబంధించి వెల్ది వసంతరావు, గట్టు విజయకుమార్‌లపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు, చిన్న తమ్ముడు ఇంద్రశేఖర్‌రావు సంతకాలు తీసుకున్నారు. తిరిగి వీరు ఆటోలో గ్రామానికి చేరుకునేసరికి వామన్‌రావు డ్రైవర్‌ సతీష్‌ ఫోన్‌చేసి హత్య జరిగిందని చెప్పారు. గుంజపడుగు గ్రామంలో రెండు దేవస్థానాల కోసం మంథని తెరాస అధ్యక్షుడిగా ఉన్న కుంట శ్రీనివాస్‌, అదే గ్రామానికి చెందిన అక్కపాక కుమార్‌, వెల్ది వసంతరావు కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ కార్యదర్శి వామన్‌రావు తమ్ముడైన ఇంద్రశేఖర్‌రావును వీరు పిలిచి సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచి కుంట రాజు (కుంట శ్రీనివాస్‌కు తమ్ముడు), పంచాయతీ అనుమతి లేకుండానే దండోరా వేయించారు. దీంతో పాటు కుంట శ్రీనివాస్‌ ఇదే గ్రామంలో పెద్దమ్మ ఆలయాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారనీ, కొత్తగా అక్రమ భవనాన్ని నిర్మిస్తున్నాడని పలుమార్లు సర్పంచితోపాటు వామన్‌రావు, నాగమణి ప్రశ్నించారు. ఫలితంగా కక్ష పెంచుకొని కుంట శ్రీనివాస్‌, వెల్ది వసంతరావు, అక్కపాక కుమార్‌లు తన కొడుకు, కోడలిని హత్య చేశారని మృతుని తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు చేశారు.

పాత కక్షలతోనే హత్య

న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీనివాస్‌ గుంజపడుగు వాస్తవ్యులే.. అయిదేళ్లుగా వీరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. వామన్‌రావు అన్ని పనులకు ఆటంకం కలిగిస్తూ కేసులు వేస్తూ తన ఎదుగుదలకు ఆటంకంగా మారాడని ఎలాగైనా వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆలయ కమిటీ ఏర్పాటు, కుల దేవతైన పెద్దమ్మ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని తట్టుకోలేక కోపంతో హత్యకు కుట్ర పన్నాడు

మొదట నేరగాడు.. ఆపై రాజకీయాల్లోకి

కుంట శ్రీను 1997లోనే సింగరేణి బొగ్గు కార్మిక సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. గతంలో బస్సు తగులబెట్టిన కేసులో రిమాండ్‌కు వెళ్లాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి రాజకీయాల్లోకి వచ్చాడు. బెంగళూరు నుంచి అక్రమంగా తుపాకీని తీసుకొస్తూ మంచిర్యాల సరిహద్దులో పోలీసులకు దొరికిపోయాడు.

తెరాస నుంచి కుంట శ్రీనివాస్‌ సస్పెన్షన్‌

తెరాస నుంచి మంథని మండల పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌ను గురువారం సస్పెండ్‌ చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. న్యాయవాద దంపతుల హత్యోదంతంలో శ్రీనివాస్‌పై అభియోగాలు రావడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించి ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి : రియల్ హీరోలకు పది రెట్ల నజరానా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.