రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 4,458 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 6,313 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 909 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. అత్యల్పంగా విజయనగరంగా 98మందికి సోకింది. ఈ మహమ్మారి కారణంగా మరో 38 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో 9మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,51,41,485 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ.. VIDEO VIRAL: కారుతో ఢీకొట్టాడు..అడిగితే దురుసుగా ప్రవర్తించాడు