రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 91, 231 మందికి పరీక్షలు చేయగా కొత్తగా 3,620 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 5,757 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా చిత్తూరులో అధికంగా ఏడుగురు మరణించగా.. కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మెుత్తం 40,074 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరిలో అత్యధికంగా 617 కొవిడ్ కేసులు ఉండగా.. అత్యల్పంగా విజయనగరంలో 95 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇదీ చదవండీ.. MP RaghuRama arrest: రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం