భూ సేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా.. ' ప్రైవేటు సంప్రదింపులు ' ద్వారా ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరించడాన్ని చట్టవిరదమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ వారం రోజులకు వాయిదా పడింది. ఇదే అంశంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యం వచ్చే వారం విచారణకు వస్తుందని ప్రభుత్వ న్యాయవాది సుభాష్ కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం.. గతంలో దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
ఇదీ చదవండి: తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 10,167 కేసులు నమోదు