ETV Bharat / city

కొవాగ్జిన్‌ కోసం లక్షల మంది ఎదురు చూపులు..! - అమరావతి వార్తలు

కొవాగ్జిన్‌ టీకా మొదటి డోసు తీసుకున్న అనేక మందికి 42 రోజుల గడువు ముగియడం వల్ల మొదటి డోసు వృధా అవుతుందని ఆందోళన చెందుతున్నారు. మరో రెండు వారాలలోపు టీకా వేసుకున్నప్పటికీ పనితీరులో ఎటువంటి మార్పు ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొవాగ్జిన్‌ రెండో డోసు వేయించుకోవాల్సిన వారు దాదాపు 3 లక్షల మంది ఉంటారని వైద్యాధికారులు చెబుతున్నారు.

many waiting to get their second dose of covaxin
కొవాగ్జిన్‌ కోసం లక్షల మంది ఎదురు చూపులు
author img

By

Published : May 20, 2021, 1:45 PM IST

హైదరాబాద్ నగరంలో కొవాగ్జిన్‌ టీకా మొదటి డోసు వేసుకున్న లక్షలాది మందికి రెండోడోసు అందబాటులోకి లేకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొదటి డోసు గడువు ముగియడంతో తాము ఇప్పుడు ఏమిచేయాలో తెలియక మదనపడుతున్నారు. ఒక వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రెండో డోసు కూడా వేసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. కేంద్రం నుంచి కొవాగ్జిన్‌ డోసులు రాకపోవడం వల్ల మూడు రోజులుగా టీకాల వేసే కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు. తిరిగి ఇది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి.

ప్రైవేటులోనూ దొరక్క..

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవాగ్జిన్‌ మొదటి డోసు వేసుకున్న నాలుగు వారాల నుంచి ఆరు వారాల్లోగా రెండో డోసు వేసుకోవచ్చు. అదే సమయంలో కొవిషీల్డ్‌ రెండో డోసును 6-8వారాల మధ్య వేయించుకునేందుకు అవకాశం ఉండగా దీన్ని ఇటీవల కేంద్రం 12-16 వారాలకు పెంచింది. దీంతో ఈ టీకా వేసుకున్న వారికి రెండో డోసుకు కొంత గడువు పెరిగింది. ఇదే సమయంలో కొవాగ్జిన్‌కు మాత్రం గడువు పొడిగించలేదు. రాష్ట్రవ్యాప్తంగా కొవాగ్జిన్‌ రెండో డోసు వేయించుకోవాల్సిన వారు దాదాపు మూడు లక్షల మంది ఉంటారని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇందులో రాజధాని పరిధిలోనే అధికంగా ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న వీరందరూ గడువు ముగియడంతో ఆందోళనలో ఉన్నారు.

అనేకమందికి 42 రోజుల గడువు కూడా ముగియడంతో మొదటి డోసు వృథా అవుతుందన్న ఆవేదనలో ఉన్నారు. ఉన్నంతలో గడువులోగా అందరికీ రెండో డోసు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ కేంద్రం నుంచి కొద్ది రోజులుగా వ్యాక్సిన్‌ నిల్వలు రాకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ ఏమీ చేయలేకపోతోంది. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు. మహానగరంలో ఒకటి, రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేస్తున్నా కూడా అక్కడ అధికంగా కొవిషీల్డ్‌ దొరుకుతోంది. కొవాగ్జిన్‌ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడకు వెళ్లి వేయించుకుందామనుకున్నా ఆన్‌లైన్‌లో స్లాట్స్‌ దొరకడం లేదు. దీంతో చాలా మంది నేరుగా ఆస్పత్రులకు వెళ్లి టీకా వేయకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వస్తున్నారు.

కంగారు పడాల్సిన అవసరం లేదు..

"కొవాగ్జిన్‌ మొదటి డోసు వేయించుకుని 42 రోజులు దాటిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో రెండు వారాల లోపు దీన్ని వేసుకున్నా కూడా పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిల్వలు చేరిన వెంటనే మళ్లీ టీకా కార్యక్రమం మొదలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గడువు ముగిసినందువల్ల మొదటి డోసు ఎందుకూ పనికిరాదన్న కంగారు అవసరం లేదు." - డా.ప్రభాకరరెడ్డి, నిమ్స్‌లో కొవాగ్జిన్‌ టీకా పరిశోధనలో కీలకపాత్ర పోషించిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌

ఇదీ చూడండి:

'దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం'

'రుయా'పై హైకోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.