ETV Bharat / city

తెలంగాణ: ఎన్నికల్లో రెబల్​గా గెలిచింది... ఇబ్బంది పడింది...! - PACS ELECTION NEWS IN TELUGU

ఎన్నికల్లో గెలిచినా... ఆ అభ్యర్థికి పాట్లు తప్పలేదు. ఓ పార్టీ రెబల్​గా దిగిన ఆ మహిళా అభ్యర్థికి... ప్రత్యర్థి పార్టీ మద్దతు తెలిపింది. తీరా గెలిచాకా... ఛైర్మన్​ పదవికి మద్దతివ్వాలంటూ భర్త సమక్షంలోనే ఆ ఇరు పార్టీలు చేసిన హంగామాలో ఇబ్బంది పడటం ఆ అభ్యర్థి వంతైంది. తెలంగాణలోని నిర్మల్​ జిల్లా కుంటాల మండలం పెంచికల్​ పాడ్​ సహకార సంఘాల ఎన్నికల్లో జరిగిన ఘటన వివరాలివి..!

lady-contestant-troubled-in-nirmal-pacs-elections
ఎన్నికల్లో రెబల్​గా గెలిచింది... ఇబ్బంది పడింది...!
author img

By

Published : Feb 16, 2020, 5:08 AM IST

ఎన్నికల్లో రెబల్​గా గెలిచింది... ఇబ్బంది పడింది...!

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్​ పాడ్​ సహకార సంఘాల ఎన్నికల్లో గెలిచినా సరే... ఓ మహిళా అభ్యర్థి తన భర్త సమక్షంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. సహకార వార్డు సభ్యురాలిగా తెరాస తిరుగుబాటు అభ్యర్థి లావణ్య కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించారు. కుంటాల మండలంలో మొత్తం 13 వార్డులకు గాను తెరాస 6 చోట్ల... కాంగ్రెస్ 6 చోట్ల గెలిచాయి.

ఛైర్మన్​ పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీల మద్దతుదారులకు లావణ్య మద్దతు తప్పనిసరిగా మారింది. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి లావణ్య బయటకు రాగానే తెరాస వర్గీయులు బలవంతంగా శిబిరానికి తరలించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకునేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది. కేకలు పెడ్తూ.. ఇరు వర్గీయుల నుంచి తప్పించుకున్న లావణ్య... భర్త కిష్టయ్య దగ్గరికి చేరింది. అనంతరం కాంగ్రెస్ శిబిరానికి వెళ్లింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి సైతం అగచాట్లు తప్పడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

ఇవీ చూడండి:

శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.