ETV Bharat / city

భాజపా సర్కారుపై 132 కోట్ల ఛార్జ్​షీట్లు వేయాలి: కేటీఆర్​ - ఈటీవీ భారత్​ వార్తలు

తెలంగాణలో.. తెరాస పాలనపై భాజపా ఛార్జ్‌షీట్‌ను విడుదల చేయడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విమర్శలు గుప్పించారు. భాజపా సర్కారు మీద 132 కోట్ల ఛార్జ్​ షీట్లు వేయాలన్నారు. దేశప్రజల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తానన్న భాజపా సర్కారు.. 15 పైసలు కూడా వేయలేదన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పినందుకు దేశయువత భాజపాపై ఛార్జ్​షీట్ వేయాలన్నారు. రెండో రోజు పలు ప్రాంతాల్లో కేటీర్‌ రోడ్‌ షోలు నిర్వహించారు.

ktr-fire-on-central
ktr-fire-on-central
author img

By

Published : Nov 23, 2020, 11:02 AM IST

భాజపా సర్కారుపై 132 కోట్ల ఛార్జ్​షీట్లు వేయాలి: కేటీఆర్​

తెలంగాణ.. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించారు. తెరాస పాలనలో వైఫల్యాలు అంటూ భాజపా ఛార్జ్​షీట్‌ విడుదల చేయడంపై కేటీఆర్​ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించినందుకు ఛార్జ్​షీట్‌ వేశారా? అని ప్రశ్నించారు. ఛార్జ్​షీట్ చేయాల్సి వస్తే.. మోదీ ప్రభుత్వం మీద 132 కోట్ల మంది ఛార్జ్​షీట్లు వేయాలన్నారు.

హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు

దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కేటీఆర్​ పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ లో చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు.. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. ఓట్ల కోసం భాజపా నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వాహనాల చలానాలు కడతామన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హామీలపై.. కేటీఆర్​ వ్యంగస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి భాజపా నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక సాయం చేయలేదు

వరదలకు హైదరాబాద్‌ అతలాకుతలమైనా.. కేంద్రం ఆర్థిక సాయం చేయలేదని కేటీఆర్​ ఆక్షేపించారు. మోకాల్లోతు నీళ్లలో తిరిగి ప్రజలకు భరోసా ఇచ్చింది.. వరద బాధితులకు అండగా నిలిచింది తెరాస నేతలే అని గుర్తుచేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిస్తే 25 వేలు ఇస్తామంటున్న భాజపా నేతలు.. ముందు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కేటీఆర్​ సవాల్‌ విసిరారు. కేటీఆర్‌ ఇవాళ ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మన్సూరాబాద్‌ బిగ్‌బజార్‌ వద్ద, 6 గంటలకు వనస్థలిపురం రైతుబజార్‌ సమీపంలో, 7 గంటలకు కర్మాన్‌‍ఘాట్‌లో కేటీఆర్​ ప్రచారం చేయనున్నారు.

ఇదీ చదవండి: నివర్ తుపాన్ : ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.