ETV Bharat / city

KRMB NEWS: సాగర్​ పర్యటనలో కేఆర్​ఎంబీ బృందం పరిశీలించిన అంశాలివే..! - కృష్ణానది యాజమాన్య బోర్డు

కేంద్రానికి తుది నివేదిక ఇచ్చే ముందు... తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు(krmb news) బృందానికి ఆ రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. కేఆర్​ఎంబీ ఉప సంఘం కన్వీనర్ బీఆర్కే పిళ్లై నేతృత్వంలోని బృందం... నాగార్జునసాగర్​లో జరిపిన రెండ్రోజుల పర్యటన ముగిసింది.

KRMB NEWS
KRMB NEWS
author img

By

Published : Nov 17, 2021, 7:13 AM IST

తెలంగాణ ప్రయోజనాలను గుర్తించాకే కేంద్రానికి తుది నివేదిక ఇవ్వాలని... కృష్ణానది యాజమాన్య బోర్డు(krishna water management board) బృందానికి ఆ రాష్ట్ర అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్(krmb gazette notification) ప్రకారం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీ(krmb news) పరిధిలో చేర్చేందుకు... ఇటీవల అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి కేఆర్​ఎంబీ ఉప సంఘం(krmb sub committe) కన్వీనర్ బీఆర్కే పిళ్లై ఆధ్వర్యంలో... 15 మంది సభ్యుల బృందం నాగార్జునసాగర్​లో పర్యటించింది. రెండ్రోజుల పర్యటనకు గాను సోమ, మంగళవారాల్లో... బృందం సభ్యులు ప్రాజెక్టును పరిశీలించారు.

నల్గొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఏఎంఆర్పీతో పాటు... దానికి అనుబంధంగా గల పుట్టంగండిని సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, లోలెవెల్ కెనాల్, ఎడమ కాల్వల వద్దకు చేరుకుని... వాటి స్థితిగతుల్ని అధ్యయనం చేశారు. అనంతరం సాగర్​లోని ఎన్నెస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్లుగా ప్రాజెక్టుకు వచ్చిన వరదలు... గతంలో చేపట్టిన పూడికతీత, ప్రస్తుతం ఎడమ కాల్వ పరిస్థితి గురించి స్థానిక అధికారుల నుంచి వివరాలడిగారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి ఎప్పుడు తెస్తారని కేఆర్​ఎంబీ బృందం ఎన్నెస్పీ అధికారులను అడగ్గా... అది తమ పరిధిలోని అంశం కాదని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలియజేశారు.

సమావేశం అనంతరం సభ్యులను... ఎన్నెస్పీ అధికారులు సన్మానించారు. పర్యటనలో... కేఆర్​ఎంబీకి చెందిన అధికారులు రాజ్ పుత్ శివరాజన్, అనుపమ ప్రసాద్, అశోక్ కుమార్, రఘునందన్ రావు, శ్రీను దండుతోపాటు సీఎంవో ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్ ఉన్నారు. ఉపసంఘం సభ్యులమంతా ఇప్పటివరకు 5 సార్లు సమావేశమయ్యామని బీఆర్కే పిళ్లై తెలియజేశారు. ప్రాజెక్టుతోపాటు అనుబంధ నిర్మాణాలను పరిశీలించామన్న ఆయన... ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకున్నాక అనుసరించే రూట్ మ్యాప్​పై అధ్యయనం చేసినట్లు వివరించారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిశీలన తర్వాత ప్రధాన విద్యుత్​ కేంద్రం, ఎడమ కాల్వపై గల విద్యుత్​కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లిన బృందాన్ని... జెన్కో అధికారులు లోపలికి అనుమతించలేదు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని... సహకరించాలని కోరడంతో సభ్యులు అక్కణ్నుంచి ప్రాజెక్టు పైకి చేరుకున్నారు. ఎడమ కాల్వపై ఉన్న విద్యుత్​కేంద్రం ద్వారానికి తాళం వేసి మరీ... బృందం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సీపీఐ వినతి పత్రం

ఈ సమయంలోనే కేఆర్​ఎంబీ సభ్యులు పిళ్లైకి నల్గొండ జిల్లా సీపీఐ(CPI) తరఫున పలువురు నేతలు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అంతకుముందు నాగార్జున సాగర్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఎన్ఎస్పీ అధికారులతో కేఆర్​ఎంబీ బృందం సమావేశమైంది. రెండు రోజులుగా నాగార్జున సాగర్ జలాశయాన్ని పరిశీలించిన సభ్యులు... సాగర్ పరిధిలోని కుడి కాలువ, దానిపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, స్పిల్ వే, క్రస్ట్ గేట్స్, ఎడమ కాలువ, సీపేజ్ వాటర్ లెవల్స్​పై చర్చించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.