KRMB Meeting: కృష్ణానదికి వరద సమయంలో సముద్రంలోకి పోయే జలాల లెక్కింపు అంశంపై బోర్డు ఏర్పాటు చేసిన జలాశయాల పర్యవేక్షక కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై నేతృత్వంలో జరిగిన సమావేశంలో మరో సభ్యుడు మౌంతాంగ్, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇరు రాష్ట్రాల జెన్కో అధికారులు పాల్గొన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి మార్గదర్శకాలు, రూల్ కర్వ్స్‌తో పాటు వరద సమయంలో సముద్రంలోకి పోయే జలాల లెక్కింపు అంశంపై కమిటీ చర్చించాల్సి ఉండగా.. వరద సమయంలో నీటి వినియోగం లెక్కింపు విషయమై శుక్రవారం సమావేశంలో చర్చించారు.
వినియోగించుకునే ప్రతి నీటిబొట్టునూ లెక్కించాల్సిందేనని తెలంగాణ అభిప్రాయపడింది. సముద్రంలోకి పోయే జలాలను దిగువ రాష్ట్రంగా తాము వినియోగించుకుంటున్నామని.. అవసరమైతే తెలంగాణ కూడా వినియోగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. గణాంకాల కోసం ఆ జలాలను కూడా లెక్కించుకునేందుకు తమకు అభ్యంతరం లేదని ఏపీ కూడా స్పష్టం చేసింది. విద్యుత్ ఉత్పత్తి సహా రూల్ కర్వ్స్ అంశాలపై కమిటీ మరో రెండు మార్లు సమావేశం కానుంది. రూల్ కర్వ్స్‌పై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలుపుతామన్న తెలంగాణ... సరిగా స్పందించకపోతే బోర్డు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంది.
ఇవీ చూడండి: CBN: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు
నాకు, నరేశ్‌కు మీ సపోర్ట్ కావాలి: పవిత్రా లోకేశ్
IND vs ENG TEST MATCH : చెలరేగిన పంత్, జడేజా.. తొలి రోజు ఆట ముగిసే సరికి..