ETV Bharat / city

2 టీఎంసీలు విడుదల చేస్తూ కృష్ణా బోర్డు ఉత్తర్వులు - krishna water board meeting

రాష్ట్రానికి తాగునీటి అవసరాల కోసం నీళ్లు విడుదల చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు బోర్డు 2 టీఎంసీలు ఇచ్చింది. నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి ఈ నెలాఖరు వరకు నీటి విడుదలకు అనుమతిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఉత్తర్వులు జారీ చేశారు.

తాగునీటికి 2 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి

author img

By

Published : May 22, 2020, 1:39 PM IST

Updated : May 22, 2020, 6:39 PM IST

ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మే నెల వరకూ గతంలో చేసిన కేటాయింపులు పూర్తవడం వల్ల తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం బోర్డును కోరింది. దీంతో ఇవాళ బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం, తెలంగాణ ఈఎన్​సీ మురళీధర్​, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

నెలాఖరుతో నీటి సంవత్సరం ముగుస్తున్నందున అప్పటి వరకు తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ కోరింది. ప్రస్తుతం సాగర్​లో 510 అడుగుల వరకు నీటిని వినియోగిస్తున్నామని, గతంలో అంతకంటే దిగువకు కూడా వెళ్లిన ఉదంతాలను ఆయన గుర్తు చేశారు. అయితే దిగువకు వెళ్లకుండా తెలంగాణ వాటాలో 49 టీఎంసీల నీరు ఉన్నందున సాగర్ కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రెండు టీఎంసీల నీరు విడుదల చేసేందుకు కమిటీ అంగీకరించింది. తమ కోటా పూర్తైందంటూ బోర్డు రాసిన లేఖలో పరిపక్వత లేదన్న ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి... తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల సహా నీటి నష్టాలు ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయనన్నారు.

తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతలపై పరిగణనలోకి తీసుకోవాలి. నీటి నష్టాలు ఇతర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో సాగర్‌లో 502 అడుగుల వరకు నీరు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. 510 అడుగుల నుంచే 2 టీఎంసీల విడుదలకు అంగీకరించారు.

- నారాయణ రెడ్డి, ఏపీ ఈఎన్‌సీ

ఏపీ తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు అడిగారు. త్రిసభ్య కమిటీ భేటీలో నీటి విడుదలకు అంగీకరించాం. మిగతా విషయాలన్నీ సెక్రటరీ చూసుకుంటారు.

-మురళీధర్​, తెలంగాణ ఈఎన్​సీ

Last Updated : May 22, 2020, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.