ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగం తాజా పరిస్థితిని సమీక్షించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఈ నెల 9న హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ ఏడాది కేటాయింపుల్లో ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎంతమేరకు వాడుకుంది? మిగులు ఎంత ఉంది? కేటాయింపులకు మించి నీరు వినియోగించుకుంటున్నాయా? లేదా కేటాయింపులకు అనుగుణంగానే వినియోగం జరిగిందా అనే అంశాలను ఈ సమావేశంలో బోర్డు సమీక్షిస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి రెండు రాష్ట్రాలకు కేటాయించిన వాటాల వినియోగం, రాబోయే నెలలకు కేటాయింపులపై చర్చ నిర్వహించనుంది. సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులు హాజరవుతారు.
రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. రెండు తెెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వినియోగం వంటివి చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగం తాజా పరిస్థితిని సమీక్షించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఈ నెల 9న హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ ఏడాది కేటాయింపుల్లో ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎంతమేరకు వాడుకుంది? మిగులు ఎంత ఉంది? కేటాయింపులకు మించి నీరు వినియోగించుకుంటున్నాయా? లేదా కేటాయింపులకు అనుగుణంగానే వినియోగం జరిగిందా అనే అంశాలను ఈ సమావేశంలో బోర్డు సమీక్షిస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి రెండు రాష్ట్రాలకు కేటాయించిన వాటాల వినియోగం, రాబోయే నెలలకు కేటాయింపులపై చర్చ నిర్వహించనుంది. సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులు హాజరవుతారు.
Body:palakonda
Conclusion:8008574300