Krishna Water: ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకున్న నీరు సహా ఈనెల 15 వరకు అవసరాలకు నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కోటాలో 236.13 టీఎంసీలు, తెలంగాణ కోటాలో 170.67 టీఎంసీలను కేటాయించింది. ఈనెల 9న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటి వరకు వినియోగించిన, ఈ నెల 15 వరకు అవసరాలకు సంబంధించి నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చింది.
Krishna Water: నవంబర్ నెలాఖరు వరకు కనీస నీటి వినియోగ మట్టంపైన శ్రీశైలంలో 76.819 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 176.501 టీఎంసీలు ఉన్నట్లు బోర్డు తెలిపింది. నవంబర్ నెలాఖరు వరకు ఏపీ 212.43 టీఎంసీల నీరు వినియోగించుకుందన్న కృష్ణా బోర్డు... డిసెంబర్ ఒకటి నుంచి 15 వరకు మరో 23.68 టీఎంసీలకు అనుమతిచ్చింది. నవంబర్ నెలాఖరు వరకు తెలంగాణ 81.85 టీఎంసీల నీరు వినియోగించుకుందున కేఆర్ఎంబీ... డిసెంబర్ ఒకటి నుంచి 15 వరకు మరో 88.82 టీఎంసీలకు అనుమతి ఇచ్చింది.
ఇవీ చూడండి: