శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.... తెలంగాణకు సూచించింది. ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం ద్వారా టీఎస్జెన్కో ఇప్పటికే 32.27 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇంకా నీరు దిగువకు వదిలితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొంది. ఏపీ ఫిర్యాదు మేరకు స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.... శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఇదీ చూడండి..