వైకాపా రెండేళ్ల పాలనలో బలహీన వర్గాలకు వంచన తప్ప.. సంక్షేమం అన్న మాటే లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బలహీన వర్గాలను అణచివేసే కార్యక్రమాలను వైకాపా ప్రభుత్వం పెద్దఎత్తున చేస్తోందని అన్నారు. సంక్షేమాన్ని అంకెల్లో చూపిస్తున్నారు తప్ప చేతల్లో లేదని విమర్శించారు.
పార్టీ రాజకీయ నిరోద్యుగులకు అవకాశం కల్పించేందుకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప నిధుల కేటాయింపులే లేవని కొల్లు రవీంద్ర అన్నారు. ఆదరణ, విదేశీ విద్య లాంటి ఎన్నో పథకాలు రద్దు చేశారని దుయ్యబట్టారు. దాడులు అక్రమ కేసులతో బలహీన వర్గాల నాయకుల్ని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వం దిగొచ్చేలా త్వరలోనే బలహీన వర్గాల ఐక్య కార్యాచరణ రూపొందిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో.. మరో జాయింట్ కలెక్టర్ పోస్టు!