ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా కార్తిక వైభవం... ఆలయాల్లో భక్తుల కోలాహలం - karthika masam

రాష్ట్రవ్యాప్తంగా కార్తికమాస ప్రత్యేకపూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. నదీతీరాలు, శివాలయాల వద్ద నిర్వహించిన లక్షదీపోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పలు దేవాలయాల్లో అభిషేకాలు, బిల్వార్చనలు, ఉత్సవాలు జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న కార్తికమాస ప్రత్యేక పూజలు
author img

By

Published : Nov 25, 2019, 5:21 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న కార్తికమాస ప్రత్యేక పూజలు

రాష్ట్రవ్యాప్తంగా కార్తిక మాస పూజలు ఘనంగా సాగుతున్నాయి. ప్రముఖ ఆలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున దీపోత్సవాలు నిర్వహించారు.

కృష్ణా జిల్లా...

కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీరామపాదం పుష్కర్‌ఘాట్‌ వద్ద దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు దంపతులు దీపం వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. కృష్ణానదిలో భక్తులు వదిలిన తెప్పలు దీపకాంతులను వెదజల్లుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో లక్ష దీపాలంకరణ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా...

ప్రకాశం జిల్లా చీరాలలోని ముత్యాలపేటలో మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మూడో రోజు కూచిపూడి సహా పలు శాస్త్రీయ నృత్యరూపకాలు కళాభిమానులను కట్టిపడేశాయి. ఒంగోలులోని కేశవస్వామిపేటలో శివాలయం వద్ద... గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు కన్నుల పండుగగా సాగింది. భక్తిగీతాలకు 70 మంది చిన్నారులు చేసిన నృత్యం భక్తి పారవశ్యంలో మునిగేలా చేసింది. దేవతామూర్తుల వేషధారణల్లో చిన్నారుల హావభావాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

అనంతపురం జిల్లా...

అనంతపురం జిల్లా హిందూపురంలో... స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. బాలయ్య సతీమణి వసుంధర, సోదరి లోకేశ్వరి స్థానిక మహిళలకు ఆహ్వానం పలికారు. కదిరిలో.... శివపార్వతులకు ప్రీతిపాత్రమైన కార్తికమాసంలో 27 నక్షత్రాలకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆర్యవైశ్య వసతి మందిరంలో సామూహిక దీపారాధన చేశారు. ధర్మవరంలో తొగట వీర క్షత్రియల ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తొగట వీర క్షత్రియ కుల గురువు దివ్య జ్ఞానానంద గిరి స్వామి విచ్చేశారు.

కర్నూలు జిల్లా...

కోడుమూరు మండలం లద్దగిరి శ్రీ రామదాసు స్వామి తిరుణాల మహోత్సవాలు పురస్కరించుకొని రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దంపతులు, పలువురు నేతలు పాల్గొన్నారు. నందికొట్కూరులోని తొగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనభోజనం కార్యక్రమం నిర్వహించారు.

విశాఖ జిల్లా...

విశాఖలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నాలుగవ రోజు ఆధ్యాత్మిక భావనను పంచింది. సిరిపురం కూడలి వద్ద ఉన్న గురజాడ కళాక్షేత్రంలో 'శ్రీ మద్భాగవ తాంతర్గత ప్రార్థనలు-వైశిష్ట్యంపై' అపూర్వమైన ప్రవచనాలు భక్తులకు ఆధ్యాత్మిక చింతన కలిగించాయి. ఇవాళ్టితో ఐదు రోజుల ఆధ్యాత్మిక ప్రవచనముల కార్యక్రమం ముగియనుంది.

తూర్పు గోదావరి జిల్లా...

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రాజమహేంద్రవరంలో కార్తీక వనసమారాధన ఏర్పాటు చేశారు. జేఎన్ రోడ్డులోని ప్రభూగారి తోటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెదేపా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.
ముమ్మిడివరం పరిధిలోని నాలుగు మండలాలు కేంద్రపాలిత ప్రాంతం యానాం వనభోజనాల సందడి నెలకొంది.. ఉసిరి చెట్టుకు పూజలు చేసిన అనంతరం పిల్లలు పెద్దలు మ్యూజిక్ చైర్ కబడ్డీ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. రాష్ట్రం నుంచే కాకుండా... తెలంగాణ నుంచి పర్యటకులు భారీగా తరలివచ్చారు.

ఇవీ చూడండి:

కోటి దీపోత్సవం జయపద్రం చేయండి: నందమూరి వసుంధర

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.