karnataka road accident: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మరణించగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు భాగ్యనగరానికి చేరుకున్నాయి. గోడేకీ కబర్‌కు చెందిన శివకుమార్, రవళి, దీక్షిత్ మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులు గోడే కీ కబర్‌కు తీసుకెళ్లారు. ముగ్గురి మృతదేహాలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. పురానాపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అర్జున్‌కుమార్, సరళాదేవి, దివాన్ష్, అనిత మృతదేహాలను ఇవాళ తరలించనున్నారు. గత నెల 28న గోవాకు వెళ్లిన 26 మంది తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అనుకోని సంఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అన్ని మృతదేహాలకు కర్ణాటకలోనే పోస్టుమార్టం పూర్తికాగా.. ముగ్గురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ మిగతావారి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలకు రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.

Road Accident Karnataka: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్ ట్రావెల్స్ ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవదహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.
ఇవీ చదవండి: