కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎస్‌ఈసీపై అధికార పార్టీ నేతల మాటల దాడిని ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు పంపాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల సాయంతో వైకాపా నేతలు హింస, దౌర్జన్యాలకు పాల్పడ్డారని...గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. ఎస్ఈసీని సీఎం, మంత్రులు తీవ్రంగా విమర్శించారని...అసభ్యపదజాలంతో దూషించారని ప్రస్తావించారు. ఎస్‌ఈసీకి అత్యున్నతస్థాయి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్న కన్నా... ప్రభుత్వం చేతిలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.
ఇదీ చదవండి :