సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కరోనా కేసులకు సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి సరైన సమాచారం రావట్లేదని అన్నారు. హెల్త్ బులెటిన్‌లో జిల్లాల వారీ సమాచారం అందించట్లేదని ప్రస్తావించారు. జిల్లాల వారీ సమాచారం ఇస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త విధానాన్ని రద్దుచేసి పాత విధానంలోనే బులెటిన్ విడుదల చేయాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: