ETV Bharat / city

'రాజధాని కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం' - three capitals for AP news

అమరావతి ప్రాంతం మందడంలో రైతులు చేపట్టిన ధర్నాకు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మద్దతు ప్రకటించారు. అన్నదాతల ఆక్రందన విషయాన్ని పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని హామీఇచ్చారు.

kanakameadala Ravindra kumar support  for capiatl farmers

author img

By

Published : Dec 25, 2019, 12:21 PM IST

రాజధాని కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం: ఎంపీ కనకమేడల

గుంటూరు జిల్లా మందడంలో రైతులు చేపట్టిన ధర్నాకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆందోళనల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాజధాని రైతుల అంశాన్ని పార్లమెంట్​లో ప్రస్తావిస్తామన్నారు. రాజధాని కోసం న్యాయస్థానాల్లో కేసులు వేస్తామని స్పష్టం చేశారు.

రాజధాని తరలింఫును ఉన్మాద చర్యగా అభివర్ణించారు. అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలున్నాయని... ఒక్క కలంపోటుతో రాజధాని తరలిస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. జీఎన్​ రావు కమిటీకి ఏం చట్టబద్ధత ఉందని ప్రశ్నించారు. రాజధానే కాదు... హైకోర్టు తరలింఫును వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని, హైకోర్టు తరలించాక అమరావతిలో ఇంకేముంటుందని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.